ఎంపీ రేసులో భవానీ రెడ్డి
దరఖాస్తు చేసుకున్న నేత
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ మొదలైంది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చాక సీన్ మారింది. ఒకప్పుడు కొట్లాటలకు కేరాఫ్ గా , బోసి పోయి ఉన్న గాంధీ భవన్ నేతలు, కార్యకర్తలు, ఆశావహులతో కిట కిట లాడుతోంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పీసీసీ చీఫ్ , సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఎవరైతే ఎంపీలుగా పోటీ చేయాలని అనుకుంటున్నారో వారంతా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వచ్చిన దరఖాస్తులను ఆధారంగా చేసుకుని అనుభవం, అర్హత, పార్టీకి చేసిన సేవలను ప్రాతిపదికగా తీసుకుని మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది పార్టీలో.
శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని భట్టి విక్రమార్క ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆమెతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి మరికంటి భవానీ రెడ్డి మెదక్ ఎంపీ అభ్యర్థిత్వం కోసం అప్లై చేశారు.