కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి
తిరుపతి – టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ కావాలని కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. నిజాయితీపరులైన అధికారులను జైలులో పెట్టారని అన్నారు. ఎన్నికల హామీలను విస్మరించారంటూ ఫైర్ అయ్యారు. పాలన చేతకాక రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. తమ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కావాలని తమ పార్టీని బలహీన పర్చడంలో భాగంగానే ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తూ వికృత ఆనందం పొందుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భూమన.
శనివారం భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక పద్దతి ప్రకారం మెల మెల్లగా సీనియర్ నేతలను, ఇతరులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. అరెస్ట్ చేయడం అనే ప్రధాన ఎజెండాతోనే పాలన సాగిస్తున్నారంటూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఆరోపించారు. ఒక రకంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందన్నారు.
ధనంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు అత్యంత నిజాయితీ కలిగిన ఆఫీసర్లంటూ కితాబు ఇచ్చారు భూమన కరుణాకర్ రెడ్డి. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని హెచ్చరించారు భూమన కరుణాకర్ రెడ్డి.