భూపాలపల్లి కోర్టు నోటీసులు..సమన్లు
హైదరాబాద్ – తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు , రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ కు బిగ్ షాక్ తగిలింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు వచ్చే అక్టోబర్ నెల 17న విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది.
కేసీఆర్ కు నోటీసు ఇవ్వగా స్మితా సబర్వాల్ కు సమన్లు జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కు భారీ నష్టం వాటిల్లిందని, దీని కారణంగా ప్రజా ధనం కు గండి పడిందని ఆవేదన వ్యక్తం చేస్తూ భూపాలపల్లికి చెందిన రాజ లింగ మూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గతంలోనే ఈ కేసుకు సంబంధించి కోర్టు నోటీసులు పంపించింది. అయినా కేసీఆర్ స్పందించ లేదు. స్మితా సబర్వాల్ భేఖాతర్ చేసింది. దీంతో తక్షణమే హాజరు కావాలంటూ కేసీఆర్ కు స్పష్టం చేసింది కోర్టు. లేక పోతే తీవ్ర చర్యలు తప్పవంటూ పేర్కొంది.
ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు హాజరు కాగా కేసీఆర్ , స్మితా సబర్వాల్ హాజరు కాక పోవడాన్ని భూపాలపల్లి కోర్టు సీరియస్ అయ్యింది. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ , సీనియర్ అధికారిగా ఉన్న స్మిత ఇలాగేనా వ్యవహరించేది అంటూ పేర్కొంది కోర్టు.