తెలంగాణ గాంధీ కృష్ణమూర్తి
మాజీ సీఎం కేసీఆర్ కానే కాదు
హైదరాబాద్ – గులాబీ శ్రేణులు తెగ ప్రచారం చేసుకుంటున్నాయి. అసలైన సిసలైన తెలంగాణ గాంధీ కేసీఆర్ అంటూ ఊదర గొడుతున్నాయి. దీనిపై కవులు, రచయితలు, కళాకారులు, సీనియర్ జర్నలిస్టులు, అనలిస్టులు తీవ్రంగా తప్పు పడుతున్నారు.
ఇదిలా ఉండగా అసలైన తెలంగాణ గాంధీ కేసీఆర్ కాదని ఇదే మట్టిలో మాణిక్యంలా మెరిసిన అసలు సిసలైన మహానుభావుడు భూపతి కృష్ణమూర్తి అని పేర్కొన్నారు. ఆయన తనకంటూ ఉన్న యావత్ ఆస్తులను తెలంగాణ కోసం దారదత్తం చేశాడు. కానీ ఎక్కడా కృష్ణమూర్తి పేరు లేక పోవడం విడ్డూరం కదూ.
తనకు సంబంధించి ఆస్తిగా వచ్చిన 600 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్రం కోసం , ఎంతో మంది పేదలకు దానం చేశాడు. దాన కర్ణుడిగా, దానవుడిగా మిగిలి పోయారు భూపతి కృష్ణమూర్తి. అంతే కాదు రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేశాడు. ఆనాడు తెలుగుదేశం పార్టీ నుండి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వ చూపారు. కానీ తనకు టికెట్ వద్దంటూ తిరస్కరించారు. తనకు రాష్ట్రం ముఖ్యమని స్పష్టం చేశారు.
ఆనాడు స్వాతంత్ర పోరాట సమయంలో గాంధీ మహాత్ముడి వెంట నడిచిన గొప్ప వ్యక్తి భూపతి కృష్ణమూర్తి. రజాకర్ల దౌర్జన్యాలపై కదం తొక్కారు. తెలంగాణ కోసం తన ఆస్తిని, అన్నీ పోగొట్టుకున్నారు.