నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ
న్యూఢిల్లీ – ఓ సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రిగా కొలువు తీరారు ఏపీకి చెందిన భూపతి రాజు శ్రీనివాస్ వర్మ. మంగళవారం ఆయన వేద ఆశీర్వచనాల మధ్య కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన సంతకం చేశారు.
అనంతరం కేంద్ర మంత్రులు గంగాపురం కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ , బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజు, ఇతర కేబినెట్ సహచరులు అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. అంతే కాకుండా ఇప్పటి వరకు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కూడా ఆరా తీస్తానని చెప్పారు. మొత్తంగా తనకు అతి పెద్ద బాధ్యతను కట్టబెట్టిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, జేపీ నడ్డా, అమిత్ చంద్ర షాలకు ధన్యవాదాలు తెలిపారు.