అబ్బా భువనేశ్వర్ దెబ్బ
రాజస్థాన్ కు బిగ్ షాక్
హైదరాబాద్ – ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ లో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ఒకే ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది రాజస్థాన్ రాయల్స్. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఆఖరి ఓవర్ ను భువనేశ్వర్ కుమార్ వేశారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 201 రన్స్ చేసింది 3 వికెట్లు కోల్పోయి. అనంతరం 202 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఈ టోర్నీలో సూపర్ బ్యాటింగ్ తో దుమ్ము రేపుతున్న జోస్ బట్లర్ , సంజూ శాంసన్ లను కళ్లు చెదిరే బంతులతో పెవిలియన్ బాట పట్టించాడు హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.
తొలి ఓవర్ లోని 2వ బంతికి బట్లర్ క్యాచ్ ఇస్తే శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇద్దరూ డకౌట్ కావడం విశేషం. నటరాజన్, జాన్సన్ , కమిన్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. చివరి ఓవర్ లో మళ్లీ వచ్చాడు భువనేశ్వర్ కుమార్. ఆఖరి ఓవర్ లో 13 పరుగులు కావాలి. కానీ పావెల్ ను ఎల్ బి డబ్ల్యూ గా వెనుదిరిగాడు. 4 ఓవర్లలో 3 వికెట్లు తీశాడు. రాజస్థాన్ పతనాన్ని శాసించాడు.