ట్రంప్ పై దాడి బైడెన్ దిగ్భ్రాంతి
బయట పడినందుకు సంతోషం
అమెరికా – ఎన్నికల ప్రచారంలో భాగంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల మోత మోగింది. ఈ ఘటన ఒక్కసారిగా ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది. ఇప్పటికే గన్ కల్చర్ ను అలవాటు చేసిన చరిత్ర అమెరికాది. నిత్యం ఎవరు ఎప్పుడు దాడులకు పాల్పడుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రపంచంలోనే పెద్దన్న పాత్ర పోషించేందుకు తహ తహ లాడే యుఎస్ ఇప్పుడు పూర్తి అభద్రతా భావంతో కొట్టు మిట్టాడుతోంది. కేవలం డాలర్ కు ఉన్న పవర్ కారణంగా ప్రతి ఒక్కరు అమెరికాను కోరుకుంటున్నారు.
ఏ హింసను ప్రేరేపిస్తూ ఇతర దేశాల మధ్య చిచ్చు పెట్టి, ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటుందో అదే దేశం ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయలేక సతమతం అవుతోంది. అందరూ చూస్తూ ఉండగానే పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పుల ఘటన కలకలం రేపింది.
ఈ ఘటనలో మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ చెవికి బుల్లెట్ తాకింది. రక్త స్రావం అయ్యింది. ఆయన సురక్షితంగా బయట పడ్డారు. ఈ కాల్పుల ఘటనపై తీవ్రంగా స్పందించారు ప్రెసిడెంట్ జోసెఫ్ బైడెన్. ఆయన క్షేమంగా బయట పడడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సెక్యూరిటీ ఏజెన్సీని అభినందించారు. తను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.