SPORTS

బుచ్చిబాబు టోర్నీ విజేత‌కు భారీ ప్రైజ్ మ‌నీ

Share it with your family & friends

ప్ర‌క‌టించిన హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహనరావు

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ జట్టుకు హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శినపల్లి జగన్మోహనరావు భారీ నగదు బహుమతిని ప్రకటించారు.

ఇటీవల తమిళనాడులో జరిగిన ఆల్ ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ఛాంపియన్‌గా నిలిచింది.

గత రంజీ సీజన్‌లో ప్లేట్‌ విభాగంలో అజేయంగా నిలిచిన హైదరాబాద్‌.. బుచ్చిబాబు టోర్నీలోనూ మిగతా జట్లపై విజయం సాధించింది.

గత సీజన్ నుంచి తమ తిరుగులేని రికార్డును కొనసాగిస్తున్నారు. దీంతో సీనియర్ పురుషుల జట్టుకు రూ. 25 లక్షల నగదు బహుమతిని అందజేస్తామని జగన్మోహన్‌రావు ప్రకటించారు.

‘సుదీర్ఘ విరామం తర్వాత బుచ్చిబాబు టోర్నీలో హైదరాబాద్ జట్టు విజేతగా నిలవడం ఆనందంగా ఉందన్నారు.

గత సీజన్‌లో రంజీ ప్లేట్‌ ఛాంపియన్‌గా నిలిచాం. ఈ సీజన్‌లో రంజీ ఎలైట్ ఛాంపియన్‌గా నిలవడమే మా లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు.

క్రికెటర్లు, సహాయక సిబ్బందికి అవసరమైన సహకారం అందించేందుకు హెచ్‌సీఏ సిద్ధంగా ఉందని జగన్ తెలిపారు.

‘ఈ సీజన్‌లో విజయం సాధించడం హైదరాబాద్ జ‌ట్టుకు అలవాటుగా మారింది. ఇంటి నుండి దూరంగా ఉన్న విజయం ఎల్లప్పుడూ ప్రత్యేకమైనది. బుచ్చిబాబు ట్రోఫీ కూడా ఈ కోవలోనే వస్తుంది. వచ్చే రంజీ సీజన్‌కు హైదరాబాద్ క్రికెటర్లు సన్నద్ధం కావాలి అని అన్నారు.

ప్రధానంగా బౌలర్లు ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలతో పోరాడేందుకు ప్రయత్నించాలి. పిచ్ నుంచి సహకారం లేకపోయినా రెండు ఎండ్‌ల నుంచి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తీసుకురావడం ముఖ్యం. దీన్ని హైదరాబాద్ బౌలర్లు ప్రాక్టీస్ చేయాలి’ అని భారత మాజీ క్రికెటర్, పేస్ దిగ్గజం వెంకటేష్ ప్రసాద్ అన్నాడు.

బుచ్చిబాబు ట్రోఫీతో హైదరాబాద్‌కు చేరుకున్న కెప్టెన్‌ రాహుల్‌సింగ్‌, కోచ్‌ ఛటర్జీ, బృందాన్ని ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు ఘనంగా సన్మానించారు.

అధ్యక్షుడు జగన్, సెక్రటరీ దేవరాజ్ క్రికెట్ క్రీడాకారులు, సహాయక సిబ్బంది పట్ల ప్రత్యేక అభిమానం చూపారు. కార్యక్రమంలో హెచ్‌సీఏ సభ్యులు దల్జీత్‌సింగ్‌, జడ్‌సెక్రటరీ బసవరాజు, కోశాధికారి సీజే శ్రీనివాసరావు, హెచ్‌సీఏ సీనియర్‌ సభ్యుడు ఆగంరావు, సీఈవో సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.