NEWSNATIONAL

బీహార్ సీఎంకు బాంబు బెదిరింపు

Share it with your family & friends

రంగంలోకి దిగిన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు

బీహార్ – బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు బాంబు బెదిరింపు వ‌చ్చింది. ఆయ‌న‌కు అల్ – ఖైదా నుండి రావ‌డం విస్తు పోయేలా చేసింది. సీఎంకు b0mb thre@t అనే ఇ మెయిల్ నుంచి ఈ హెచ్చ‌రిక‌ను అందుకున్నారు.

నితీష్ కుమార్ బేషరతుగా ప్రధాని మోడీకి మద్దతు ఇస్తున్నారని, అందుకే నితీశ్ కుమార్ ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాల‌ని ఆ మెయిల్ లో పేర్కొన్న‌ట్లు స‌మాచారం. అంతే కాదు సీరియ‌స్ కామెంట్స్ కూడా చేశారు.

బీహార్ ప్రత్యేక పోలీసులు కూడా తమను ఏమీ చేయలేరని మెయిల్ పంపిన వారు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా చేసిన‌ట్లు టాక్. సీఎం నితీశ్ కుమార్ కు ఇ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావ‌డం, చంపుతామ‌ని హెచ్చ‌రించ‌డంతో సీరియ‌స్ గా తీసుకుంది కేంద్ర స‌ర్కార్.

ఈ బెదిరింపు ఇ మెయిల్ కు సంబంధించి బీహార్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దర్యాప్తు ప్రారంభించింది. బాంబు బెదిరింపుపై ఇంకా సీఎం నితీశ్ కుమార్ స్పందించ లేదు.