మూడోసారి ప్రధానిగా రికార్డ్
న్యూఢిల్లీ – ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ చీఫ్ , బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర దామోదర దాస్ మోడీ ముచ్చటగా మూడోసారి కొలువు తీరారు. ఆయన 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో కాంగ్రెస్ పార్టీయేతర వ్యక్తి పీఎంగా మూడుసార్లు ప్రధానమంత్రి కావడం ఓ రికార్డ్.
గతంలో ప్రథమ దేశ ప్రధానమంత్రి దివంగత జవహర్ లాల్ నెహ్రూ పేరు మీద ఉండేది. దానిని మోడీ సమం చేశారు. తన దృష్టి కేవలం సమస్యలపై , వాటి పరిష్కారంపై , అంతకు మించి 2049 వరకు భారత దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ది పథంలోకి తీసుకు వెళ్లడంపై ఫోకస్ పెట్టడమేనని స్పష్టం చేశారు నరేంద్ర దామోదర దాస్ మోడీ.
ఇదిలా ఉండగా పీఎంగా కొలువు తీరిన నరేంద్ర మోడీని ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు బిల్ గేట్స్. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. మీ సారథ్యంలో భారత దేశం మరింత ముందుకు వెళుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మోడీ బిల్ గేట్స్ కు ధన్యవాదాలు తెలిపారు.