తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం
హైదరాబాద్ – ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బర్డ్ ఫ్లూ వ్యాధి సోకడంతో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో చికెన్ అమ్మకాలు చేపట్టవద్దని కోరింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీ నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ సరిహద్దుల్లోకి కోళ్లు వస్తుండడంతో వాటిని వెనక్కి పంపించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలో 24 చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున వస్తున్న కోళ్ల వాహనాలను తిప్పి పంపించారు.
ఈ సందర్బంగా ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. పశు సంవర్దక అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, కోళ్లను అమ్మకుండా చూడాలని, తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
దీంతో కోళ్ల వ్యాపారులు, దుకాణాదారులు, వీటిపై ఆధారపడి పని చేస్తున్న వారిపై భారీ ఎఫెక్ట్ పడింది. కోళ్లకు ఊహించని వైరస్ సోకిందని, దీనిని కంట్రోల్ చేసేందుకు మందులు, ఇంజెక్షన్లు ఇస్తున్నామని ఇప్పటికే తెలిపారు ఉన్నతాధికారులు. తొందరపడి ఎవరూ కూడా చికెన్ తినొద్దంటూ హెచ్చరించారు.