తెలంగాణలో సర్కార్ రెడ్ అలర్ట్
అమరావతి – ఏపీని బర్డ్ ఫ్లూ వ్యాధి వణికిస్తోంది. దీంతో ముందు జాగ్రత్తగా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కొంత కాలం పాటు చికెన్ కు దూరంగా ఉండాలని ఆదేశించింది. జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. లక్షల కోళ్లు అంతు చిక్కని వైరస్ తో మృత్యువాత పడుతున్నాయి. మరో వైపు ఏపీ నుంచి కోళ్లను తీసుకు వచ్చే వాహనాలను తెలంగాణ సరిహద్దుల్లోనే తిరిగి పంపిస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో ఒకరికి బర్డ్ ఫ్లూ సోకిందని సమాచారం.
ఉంగుటూరు మండలంలో ఒక వ్వక్తి కి బర్డ్ ఫ్లూ నిర్దారణ కావడం జనం బెంబేలెత్తి పోతున్నారు. బర్డ్ ఫ్లూ కేసు నమోదు కావడంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. కోళ్లఫారం సమీపంలోని ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉండటంతో సాంపిల్స్ సేకరించారు అధికారుల.
బర్డ్ ఫ్లూగా నిర్ధారణ రావడంతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని అప్రమత్తం చేశారు.
బర్డ్ ఫ్లూ తొలికేసు నమోదైందని వెల్లడించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ మాలిని. బర్డ్ ఫ్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఈ వ్యాధి పట్ల ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.