అల్లు స్నేహా రెడ్డికి బర్త్ డే విషెస్
పుట్టిన రోజు శుభాకాంక్షలు
హైదరాబాద్ – ఎవరీ స్నేహా రెడ్డి అనుకుంటున్నారా. అల్లు వారింట కోడలిగా అడుగు పెట్టిన వ్యక్తి. తను ప్రముఖ నటుడు అల్లు అర్జున్ కు భార్య. వీరికి ఓ పాప ఓ బాబు. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఘనంగా జరిగింది. దాదాపు వీరి పెళ్లికి ఏకంగా రూ. 100 కోట్లు ఖర్చు చేశారు అప్పట్లో.
సెప్టెంబర్ 29న పుట్టిన రోజు స్నేహా రెడ్డిది. ఆమెకు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు సినీ, తదితర రంగాలకు చెందిన ప్రముఖులు. నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని, ఆయురారోగ్యంతో కలకాలం వర్దిల్లాలని దీవిస్తున్నారు.
ఇక అల్లు అర్జున్ గురించి చెప్పాల్సి వస్తే ప్రస్తుతం తను పుష్ప -2 మూవీ లో నటించాడు. అది విడుదలకు సిద్దంగా ఉంది. మరో ప్రాజెక్టు పనిమీద ఫోకస్ పెట్టాడు. వీరిద్దరి సినిమా లో లాగానే రొమాంటిక్ లవ్ స్టోరీ కావడం విశేషం.
అటు అల్లు అర్జున్ ఇటు స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తమ విశేషాలను, ఫోటోలను పంచుకుంటారు. తమ అభిమానులకు కనువిందు చేస్తారు. ఇవాళ బన్నీ , స్నేహా రెడ్డి అభిమానులు తమ అభిమాన నటుడి భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు.
అంతే కాదు సంబురాలలో మునిగి పోయారు. మొత్తంగా స్నేహా రెడ్డికి మనమూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ చేద్దాం.