NEWSNATIONAL

బీజేడీ ఎంపీ మ‌మ‌తా మొహంతా రాజీనామా

Share it with your family & friends

మాజీ సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ కు బిగ్ షాక్

ఒడిశా – బిజూ జ‌న‌తా ద‌ళ్ పార్టీ చీఫ్ , మాజీ ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. త‌మ పార్టీకి చెందిన ప్ర‌స్తుత ఎంపీగా ఉన్న మమ‌తా మొహంతా తాను పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ మేర‌కు ఆమె త‌న రాజీనామా ప‌త్రాన్ని పార్టీ చీఫ్ న‌వీన్ ప‌ట్నాయ‌క్ కు పంపించారు. తాను పార్టీని వ్య‌క్తిగ‌త కార‌ణాల రీత్యా వీడుతున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు మ‌మ‌తా మొహంతా. భార‌తీయ జ‌న‌తా పార్టీలో తాను చేరనున్న‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల దేశ వ్యాప్తంగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ, బీజేడీ విడి పోయాయి. ఒంట‌రిగానే బ‌రిలోకి దిగింది. బీజేపీ ఒడిశాలో సుదీర్ఘ కాలం పాటు కొలువు తీరిన న‌వీన్ ప‌ట్నాయ‌క్ ను గ‌ద్దె దించింది.

రాజ్య స‌భ‌లో ఎన్డీయే ప్ర‌భుత్వానికి బీజేపీ మ‌ద్ద‌తు ఉప సంహ‌రించుకుంది. త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి వ‌చ్చేలా ఆమె రాజీనామాను రాజ్య‌స‌భ చైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్ క‌ర్ ఆమోదం తెలిపారు. రాజీనామా అనంత‌రం మ‌మతా మొహంతా మీడియాతో మాట్లాడారు. త‌న సేవ‌లు పార్టీకి అవ‌స‌రం లేద‌ని తాను భావిస్తున్న‌ట్లు చెప్పారు.