ఆరు స్థానాలకు బీజేపీ టికెట్లు
ఖరారు చేసిన బీజేపీ హైకమాండ్
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ హైకమాండ్ సంచలన ప్రకటన చేసింది. త్వరలో రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు గాను కేవలం 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా 11 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. చాలా చోట్ల ఆశావహులు పెరిగారు.
పోటీ పెరిగడంతో చాలా నియోజకవర్గాలలో ముగ్గురి కంటే ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఊహించని రీతిలో ఎనిమిది సీట్లు కైవసం చేసుకుంది. ఒక రకంగా గత బీఆర్ఎస్ పార్టీని దాటేసింది కొన్ని నియోజకవర్గాలలో ఓట్ల శాతంలో.
ఇది పక్కన పెడితే మొత్తం సీట్లలో కేవలం ఆరు సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించడం విస్తు పోయేలా చేసింది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. నలుగురు సిట్టింగ్ లలో ముగ్గురికి తిరిగి టికెట్ కేటాయించింది బీజేపీ హైకమాండ్.
సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి గంగాపురం కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ సీటుకు బండి సంజయ్ కుమార్ పటేల్ ను ఎంపిక ఏసింది. నిజామాబాద్ లోక్ సభకు అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్ , చేవెళ్లకు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని, ఖమ్మంకు డాక్టర్ వెంకటేశ్వర్ రావు, భువనగిరికి బూర నర్సయ్య గౌడ్ ను ఎంపిక చేసింది.