బీసీలకు 15 చోట్ల అవకాశం కల్పించిన పార్టీ
హైదరాబాద్ – తెలంగాణలోని 27 జిల్లాలకు కొత్తగా అధ్యక్షులను ప్రకటించింది బీజేపీ. బీసీలకు 15 జిల్లాల్లో చోటు కల్పించింది. ఓసీలకు 10, ఎస్సీలకు రెండు చోట్ల ఛాన్స్ ఇచ్చింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటంబ సర్వేను చేపట్టింది. అత్యధికంగా బీసీలు ఉన్నారని తేలింది. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు రానున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని పార్టీ బహుజనులకు ప్రయారిటీ ఇచ్చింది.
రాష్ట్రంలో ప్రధానంగా బీజేపీకి ఊహించని రీతిలో జనం సీట్లను కట్టబెట్టారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించారు. కామారెడ్డిలో అయితే ఏకంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ లను ఓడించారు బీజేపీ ఎమ్మెల్యే కాట్రపల్లి వెంకట రమణా రెడ్డి. ఇది దేశంలోనే సంచలనం రేపింది.
ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. దక్షిణాదిలో మరింత బలం పెంచుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం గ్రామాలు, పట్టణాలపై ఫోకస్ పెట్టాలని, అత్యధిక స్థానాలను గెలుచు కోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ చీఫ్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు శ్రేణులకు.