బీఆర్ఎస్ ..బీజేపీకి భారీ విరాళాలు
భారీ ఎత్తున సమర్పించుకున్న కంపెనీలు
హైదరాబాద్ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు దెబ్బకు అసలు దొంగల బండారం బట్టబయలు అయ్యింది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్ భారీ ఎత్తున అధికారిక అవినీతికి తెర లేపింది. అదే ఎలక్టోరల్ బాండ్ల స్కీం.
దేశానికి చెందిన వారు ఎవరైనా , ఏ సంస్థ అయినా ఎన్ని కోట్లు అయినా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వ వచ్చని, ఇందుకు సంబంధించి వివరాలు బయటకు వెల్లడించాల్సిన అవసరం లేదని పేర్కొంది. దీంతో ఈ దేశాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు అడ్డగోలుగా సంపాదించిన కంపెనీలన్నీ గంప గుత్తగా బీజేపీకి విరాళాలు అందజేశాయి.
ఆ ఒక్క పార్టీకి ఏకంగా రూ. 6,000 కోట్లకు పైగా విరాళాలు సమర్పించుకున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ప్రకటించిన తర్వాత ఏకంగా 60కి పైగా సంస్థలు రాజకీయ పార్టీలకు రూ. 250 కోట్లు సమర్పించాయి. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఈ సంస్థల నుండి రూ. 162.2 కోట్ల విలువైన బాండ్లను ఎన్ క్యాష్ చేయడం విశేషం.
రూ. 100 కట్ల కంటే ఎక్కువ లేదా 40 శాతం కంటే ఎక్కువగా బీజేపీకి వచ్చాయి. ఇక బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది. రూ. 61 కోట్లు అందుకున్నాయి. రూ. 32 కోట్లతో కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. టీడీపీ, టీఎంసీకి రూ. 13 కోట్ల చొప్పున విరాళాలు వచ్చాయి. ఈ పథకాన్ని 2017-2018లో చట్టంగా తీసుకు వచ్చారు. అయితే ఎలక్టోరల్ బాండ్లను మార్చి 2018 నుంచి అమలైంది.