పీఎంకేకు బీజేపీ బంపర్ ఆఫర్
10 ఎంపీ సీట్లు కేటాయించిన హైకమాండ్
తమిళనాడు – తమిళనాట సీఎం ఎంకే స్టాలిన్ ను దెబ్బ కొట్టేందుకు పావులు కదుపుతోంది భారతీయ జనతా పార్టీ. గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదే పదే తమిళనాడులో పర్యటిస్తున్నారు. తన దైన ముద్ర కనబర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఈసారి ఎలాగైనా సరే రాష్ట్రంలో అన్ని సీట్లను క్వీన్ స్వీప్ చేయాలని కంకణం కట్టుకుంది బీజేపీ. ఇందులో భాగంగా భారీ ఎత్తున రోడ్ షోలు నిర్వహిస్తోంది. అంతే కాకుండా భారీ ఎత్తున సభలను చేపడుతోంది. ఇప్పటికే పొత్తులో భాగంగా ఏఐఎండీకేకు కొన్ని సీట్లు కేటాయించింది బీజేపీ.
ఇదే సమయంలో యంగ్ లీడర్ , మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కె. అన్నామలై నేతృత్వంలోని బీజేపీ మరింత దూకుడు పెంచింది. భావ సారూప్యత కలిగిన వారితో పొత్తు కుదుర్చుకునే పనిలో పడ్డారు. ఎలాగైనా సరే డీఎంకేను తమిళనాడులో లేకుండా చేయాలని తన సంకల్పం అని పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. సీఎంకు కంటి మీద కునుకే లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యాడు.
ఇందులో భాగంగా పీఎంకే చీఫ్ రాందాస్ తో కె. అన్నామలై భేటీ అయ్యారు.ఈ సందర్బంగా 10 సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని స్పష్టం చేశారు. దీంతో బీజేపీ, పీఎంకే కలిసి సత్తా చాటేందుకు రెడీ అయ్యాయి.