నిప్పులు చెరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ
ఢిల్లీ – ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలలో సీఎం రేఖా గుప్తా నిద్ర పోవడం పట్ల ఆప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ వైపు సమస్యలతో సతమతం అవుతుంటే, ప్రధాన అంశాలపై చర్చ జరుగుతుంటే బాధ్యత కలిగిన సీఎం నిద్ర పోవడం ఎంత వరకు సబబు అంటూ ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. రేఖా గుప్తపై లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా చర్యలు తీసుకోవాలని, సభా సమయాన్ని వృధా చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆప్ డిమాండ్ చేసింది.
నిద్ర పోతున్న సీఎం రేఖా గుప్తా ఢిల్లీని ఎలా ముందుకు తీసుకు వెళతారంటూ ప్రశ్నించింది. ఢిల్లీ బాగోగులు చూసేందుకు ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే ఆమె నిద్ర పోయేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తోందంటూ మండిపడ్డారు.
ప్రస్తుతం సీఎం నిద్ర పోతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది బీజేపీ. తమ పార్టీకి చెందిన నాయకురాలు సీఎం నిద్ర పోవడం లేదని ధ్యానం చేస్తోందంటూ స్పష్టం చేసింది.