భాయ్ జగ్తాప్ పై బీజేపీ ఫైర్
కేసు నమోదు చేయాలని డిమాండ్
మహారాష్ట్ర – మహారాష్ట్రలో ఎన్నికల అనంతరం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నాయని , ఈవీఎం ట్యాంపరింగ్ చోటు చేసుకుందని ఆ పార్టీ ఆరోపించింది. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే భాయ్ జగ్తాప్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అడుగులు మడుగులు ఒత్తుతోందంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి అన్నారు. అంతే కాదు గులాంగిరీ చేస్తోందంటూ మండిపడ్డారు భాయ్ జగ్తాప్.
దీంతో భాయ్ జగ్తాప్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ సీనియర్ నేత కిరీటి సోమయ్య. మోడీకి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా తాను సారీ చెప్పే ప్రసక్తి లేదన్నారు భాయ్ జగ్తాప్. రాజ్యాంగ బద్దమైన సంస్థ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు కిరీటి సోమయ్య. ఆయన ఈసీకి, ముంబై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. తక్షణమే భాయ్ జగ్తాప్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.