నిన్న విమర్శలు నేడు ప్రశంసలు
బీజేపీలో చేరగానే పెరిగిన పాపులారిటీ
న్యూఢిల్లీ – ఈ దేశంలో కొత్త సంస్కృతి నెలకొంది. బీజేపీని గతంలో విమర్శించిన వాళ్లంతా ఇప్పుడు కాషాయ జెండా నీడన సేద దీరుతున్నారు. వారంతా ఒకప్పుడు ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు కావడం విశేషం. మోదీని, ఆయన పరివారాన్ని, బీజేపీని , దాని అనుబంధ సంస్థలను తూర్పార బట్టారు. కానీ బీజేపీలో చేరాక వారికి ప్రశంసలు కురుస్తున్నాయి. అంతకు మించి పాపులారిటీ వస్తోంది. మొదట బాధితులు తర్వాత నేతలుగా ఎలా ఎదిగారనే దానిపై ప్రముఖ ఫ్యాక్ట్ చెకర్ మహమ్మద్ జుబైర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు.
వారెవరో చూస్తే ముందుగా షెహజాద్ పూనావాలా గురించి చెప్పుకోక తప్పదు. ఆయన మోదీ, బీజేపీ ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా రాశారు. వారిని తాలిబాన్, ఐసిస్, బోకో హరామ్ మొదలైన వారితో పోల్చారు. భక్తులు అతనిని, అతని తల్లిని దుర్భాషలాడారు. తర్వాత అతను కాషాయ పార్టీలో చేరాడు, అదే భక్తులు తమ ట్విట్టర్ ఖాతాలో ‘షెహజాద్‌ను అనుసరించడం గర్వంగా ఉందంటూ బీజేపీ శ్రేణులు పేర్కొనడం గమనార్హం.
ఇక ఖుష్బూ సుందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ఆమె నటిగా అందరికీ సుపరిచితం. ఆమె బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకంగా మాట్లాడారు. భక్తులు ఆమెను ట్రోల్ చేశారు, ఖుష్బూ మతాన్ని గుర్తు చేశారు. ఆమె తర్వాత బీజేపీలో చేరారు, భక్తులు ఇప్పుడు ఆమె చేసిన ట్వీట్ల కోసం ఆమెను ప్రశంసించడం ప్రారంభించారు. .
జ్యోతిరాదిత్య సింధియా మొదట కాంగ్రెస్ లో ఉన్నారు. పలు పదవులు పొందారు. ఆయన పదే పదే బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోదీకి వ్యతిరేకంగా మాట్లాడారు. భక్తులు అతన్ని దేశద్రోహి అని పిలిచారు, హిందువుల వ్యతిరేకి అని పిలిచారు, అతని పూర్వీకులు బ్రిటిష్ వారి పక్షాన ఉన్నారని గుర్తు చేశారు. అతను తరువాత బిజెపిలో చేరాడు, భక్తులు ఇప్పుడు అతని ట్వీట్లను విస్తరించడమే కాదు ప్రశంసల వర్షం కురిపించారు.
కపిల్ మిశ్రా గురించి చెప్పేందుకు ఏమీ లేదు. బిజెపి, ఆర్ఎస్ఎస్, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడారు, ఢిల్లీ అసెంబ్లీలో ప్రధాని మోడీకి సంబంధించిన ఆరోపణ (స్నూప్‌గేట్) గురించి కూడా ప్రస్తావించారు. భక్తులు అతనిని, కుటుంబాన్ని దుర్భాషలాడారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీ భక్తులు కపిల్ మిశ్రాను ఫాలో కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
షాజియా ఇల్మీ అయితే ఏకంగా మోడీ, ఆర్ఎస్ఎస్ , బీజేపీ మత రాజకీయాలను తూర్పార బట్టారు. కాషాయ భక్తులు ట్రోల్ చేయడం ప్రారంభించారు. తట్టుకోలేక బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు మోస్ట్ పాపులర్ అయ్యారు.
గౌరవ్ భాటియా మోడీ, ఆర్ఎస్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆయన భక్తులచే దుర్భాషలాడారు, ట్రోల్ చేయబడ్డారు. అతను తరువాత బిజెపిలో చేరాడు, భక్తులు ఇప్పుడు అతన్ని యుపిలో అత్యంత అందమైన వ్యక్తిగా భావిస్తారు.
షెహ్లా రషీద్ మోదీ, ఆర్ఎస్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా రాశారు… భక్తులు కొన్నాళ్లుగా ఆమెను ట్రోల్ చేసి దుర్భాషలాడారు, మీమ్స్‌ని ఉపయోగించి లైంగిక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆమె మోదీని, బీజేపీని పొగడడం మొదలు పెట్టారు.
బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా జయంత్ చౌదరి మాట్లాడారు. భక్తులు ఆయనను ట్రోల్ చేసి దుర్భాషలాడారు. ఆ తర్వాత బీజేపీతో చేతులు కలిపారు. ఇప్పుడు ప్రధాని మోదీకి మద్దతుగా నిలిచినందుకు ఆయనను ప్రశంసిస్తున్నారు.
బాక్సర్ విజయేందర్ మోడీ, బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడాడు, వారిని రైతు వ్యతిరేకి అని అన్నారు. భక్తులు అతనిని ఖలిస్తానీ అని పిలిచి దుర్భాషలాడారు. ఆయన ఇప్పుడు బీజేపీలో చేరారు, ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.