కీలక శాఖలన్నీ కాషాయ పరివారానికే
ఎన్డీయే సర్కార్ లో పదవులపై ఉత్కంఠ
న్యూఢిల్లీ – ఎన్నికల పండుగ ముగిసింది. ఎవరు కేంద్రంలో పవర్ లోకి వస్తారనే ఉత్కంఠకు తెర పడింది. చావు తప్పి కన్ను లొట్ట పోయిందన్న చందంగా నరేంద్ర మోడీ టీడీపీ, నవీన్ కుమార్ సాయంతో గట్టెక్కేందుకు ప్రయత్నం చేశారు. చివరకు ఆశించిన దాని కంటే అతి తక్కువగా సీట్లను పొందారు. ఒక రకంగా ఆయన బరిలో నిలిచిన వారణాసిలో సైతం తను కొన్ని రౌండ్లలో ఓట్లను పొందలేక పోవడం విస్తు పోయేలా చేసింది. మోడీ చరిష్మా పని చేయలేదని అర్థమై పోయింది.
ఎలాగో నయానో భయానో మరోసారి ట్రబుల్ షూటర్ అమిత్ చంద్ర షా రంగంలోకి దిగాడు. ఆయన ప్రయత్నం ఫలించింది. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లు తోక జాడించకుండా ఉండేందుకు గాను కొంతమంది స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు.
చివరకు ఎన్డీయే సమావేశంలో నరేంద్ర మోడీనే తమ పీఎం అంటూ ప్రకటించేలా చేశారు. ఇక 9న కొలువు తీరనుంది సర్కార్. అంత లోపు కీలక శాఖలు ఎవరి వద్ద ఉంటాయనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో వాటిని బీజేపీ తెలివిగా తన వద్దే ఉంచుకుంటుందని టాక్.
ప్రధాన శాఖల పరంగా చూస్తే హోం, ఆర్థిక, రక్షణ, రైల్వే, ఐటీ, న్యాయ శాఖలకు సంబంధించిన శాఖలపైనే కన్నేసి ఉంచింది కాషాయ పరివారం.