ఎంపీ అభ్యర్థులపై బీజేపీ ఫోకస్
హైకమాండ్ కీలక సమావేశం
న్యూఢిల్లీ – కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతోంది నోటిఫికేషన్ ఇచ్చేందుకు . దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అన్న నినాదంతో ముందుకు వెళుతోంది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ సర్కార్.
ఇదిలా ఉండగా తమ పార్టీ తరపున అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది బీజేపీ. ఈ మేరకు మోదీ అధ్యక్షతన సమావేశమైంది పార్టీ. పార్టీ బాస్ జేపీ నడ్డా, ట్రబుల్ షూటర్ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు కీలకమైన సీనియర్ నాయకులు హాజరయ్యారు.
ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమిని ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్దమైంది. ఈ మేరకు ఈసారి కూడా తమదే సర్కార్ అనే ధీమాలో ఉన్నారు మోదీ. గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు సాధించాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని వారి వద్దకు వెళ్లాలని సూచించారు. ఇదే సమయంలో ఈసారి 545 సీట్లకు గాను బీజేపీ టార్గెట్ 400 సీట్లకు పైగా సాధించాలని , ఆ దిశగా ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.