NEWSNATIONAL

కీల‌క ప‌ద‌వుల‌పై బీజేపీ క‌స‌ర‌త్తు

Share it with your family & friends

జేడీయూకు మూడు శాఖ‌లు

న్యూఢిల్లీ – క‌థ ముగిసినా ఇంకా శాఖ‌ల కేటాయింపు కొలిక్కి రాలేదు. ఆశించిన మేర సంఖ్యా బ‌లం లేక పోవ‌డంతో భార‌తీయ జ‌న‌తా పార్టీ మిత్ర‌ప‌క్షాల‌పై ఆధార ప‌డాల్సిన అవ‌స‌రం నెల‌కొంది. దీంతో తెలుగుదేశం పార్టీ, జేడీయూ పార్టీల నేత‌లు నారా చంద్ర‌బాబు నాయుడు, నితీశ్ కుమార్ కీల‌కంగా మార‌నున్నారు.

ఈనెల 9న ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర మోడీ కొలువు తీర‌నున్నారు. ఆయ‌న‌తో పాటు కేంద్ర కేబినెట్ కూడా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నుంది. ఈ త‌రుణంలో కీల‌క ప‌ద‌వులు కావాల‌ని బాబు, నితీశ్ మెలిక పెట్టిన‌ట్లు స‌మాచారం.

ఈ త‌రుణంలో కీల‌క‌మైన పంజాయ‌తీరాజ్ , గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ‌ల‌ను జేడీయూకి ఇచ్చే అంశాన్ని బీజేపీ ప‌రిశీలిస్తోంది. సివిల్ ఏవియేష‌న్ , స్టీల్ శాఖ‌ల‌తో పాటు డిప్యూటీ స్పీక‌ర్ పోస్టుల‌ను తెలుగుదేశం పార్టీకి కేటాయించే ఛాన్స్ ఉంది.

ఇక ఆర్థిక, రక్షణ వంటి ముఖ్యమైన మంత్రిత్వ శాఖలలో ఎన్‌డిఎ మిత్రపక్షాలను రాష్ట్ర మంత్రులుగా నియమించ‌నుంది. ఈ శాఖ‌ల‌తో పాటు ప‌ర్యాట‌కం, ఎంఎస్ఎంఈ, నైపుణ్యాభివృద్ది, సైన్స్ అండ్ టెక్నాల‌జీ, ఎర్త్ సైన్సెస్ , సామాజిక న్యాయం, సాధికార‌త మిత్ర‌ప‌క్షాల‌కు ఇవ్వ‌నుంది.