NEWSNATIONAL

ఒడిశాలో క‌మ‌ల వికాసం

Share it with your family & friends

బీజేడీకి షాక్ త‌ప్ప‌దు

ఒడిశా – ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సోమ‌వారం ఆయ‌న ఒడిశా రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. అంత‌కు ముందు ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌సిద్ది చెందిన పూరీలోని జ‌గ‌న్నాథుడి ఆల‌యాన్ని సంద‌ర్శించారు. అనంత‌రం బీజేపీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ర్యాలీ, రోడ్ షోలో పాల్గొన్నారు.

జూన్ 10న ఒడిశాలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతోంద‌ని చెప్పారు. దేశ వ్యాప్తంగా క‌మ‌ల వికాసం క‌నిపిస్తోంద‌ని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. బీజేపీ కూట‌మికి క‌నీసం 400 కంటే ఎక్కువ సీట్లు వ‌స్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేశారు మోడీ.

ఇక తాను చ‌రిత్ర సృష్టించ బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ దేశంలో జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ త‌ర్వాత తానే మూడోసారి ముచ్చ‌టగా పీఎంగా కొలువు తీర‌బోతున్న‌ట్లు తెలిపారు. 143 కోట్ల మంది భార‌తీయులంతా ముక్తకంఠంతో బీజేపీ రావాల‌ని కోరుకుంటున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన మంత్రి.