బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ
ప్రకటించిన ప్రధాన మంత్రి మోదీ
న్యూఢిల్లీ – భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పార్టీ తరపున మేనిఫెస్టో తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం కీలక ప్రకటన చేసింది బీజేపీ హైకమాండ్ .
ఇందులో భాగంగా 2024 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షుడిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను నియమించింది. ఆయనతో పాటు మధ్య ప్రదేశ్ కు చెందిన మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ , వసుంధరా రాజేను కూడా చేర్చింది.
తన మూడో టర్మ్ లో కీలకమైన నిర్ణయాలు ప్రకటించ బోతున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు. సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాము పదేళ్ల కాలంలో చేపట్టిన పనులే తమను తిరిగి పవర్ లోకి తీసుకు వచ్చేలా చేస్తామని స్పష్టం చేశారు మోదీ.
ఇదిలా ఉండగా శివ రాజ్ సింగ్ చౌహాన్ , వసుంధర రాజేతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ , పీయూష్ గోయల్ కూడా ఇందులో భాగం చేసింది.