సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటన
ఢిల్లీ – భారతీయ జనతా పార్టీ హైకమాండ్ సంచలన ప్రకటన చేసింది. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి సంబంధించి దేశ రాజధానికి ఎవరిని ముఖ్యమంత్రిగా చేస్తారనే దానిపై ఉత్కంఠకు తెరదించింది. పార్టీకి చెందిన ట్రుబుల్ షూటర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ పార్టీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో కూడిన కీలక కమిటీ సమావేశమైంది. ఏకగ్రీవంగా ఆప్ పార్టీ చీఫ్ , మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను న్యూఢిల్లీ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో చిత్తుగా ఓడించిన డైనమిక్ లీడర్ పర్వేశ్ వర్మను సీఎంగా ఎంపిక చేసినట్లు ప్రకటించింది.
పర్వేశ్ వర్మ బీజేపీలో మోస్ట్ పాపులర్ లీడర్ గా గుర్తింపు పొందాడు. తను గతంలో జర్నలిస్ట్ గా పని చేశారు. సమయం, సందర్భం చూసుకుని కామెంట్స్ చేయడంలో, కలకలం రేపడంలో తనకు తనే సాటి. తమ పార్టీని గెలిపిస్తే, ప్రత్యేకించి తనను ఎన్నుకుంటే ఢిల్లీ లోని రోడ్లను అన్నింటిని ప్రియాంక గాంధీ అందమైన బుగ్గలు లాగా చేస్తానంటూ సంచలన కామెంట్స్ చేశాడు. దీంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు పర్వేశ్ వర్మ.
తన తండ్రి గతంలో ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పని చేశారు. తను ఎంపీగా రెండుసార్లు గెలుపొందాడు. ఈసారి సీఎం సీటుపై కన్నేశాడు. పార్టీ నుంచి పలువురు సీఎం రేసులో ఉన్నప్పటికీ చివరకు ప్రధానమంత్రి మోడీ మాత్రం పర్వేశ్ వర్మ వైపే మొగ్గు చూపారు. దీంతో హై కమాండ్ తననే ఖరారు చేసింది.