ముందంజలో ఉన్న పర్వేశ్ వర్మ
ఢిల్లీ – ఢిల్లీ పీఠం బీజేపీ దక్కించు కోవడంతో ఇప్పుడు సీఎం ఎవరనే దానిపై తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానుంది. ఇప్పటికే సీఎం పదవిలో ఎవరిని కూర్చోబెట్టాలనే దానిపై ప్రధాని మోడీ, ట్రబుల్ షూటర్ అమిత్ షా కీలక చర్చలు జరిపారు. ప్రస్తుతానికి బీజేపీ నుంచి సీఎం రేసులో ముందంజలో కొనసాగుతున్నారు పర్వేశ్ వర్మ. కాగా రేపటి నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు పీఎం. ఆయన వెళ్లక ముందే ఖరారు చేయాలని భావిస్తోంది పార్టీ.
ఇదిలా ఉండగా తాజాగా ఢిల్లీలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏకంగా 50 స్థానాలను కైవసం చేసుకుంది. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 20 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా బోణీ కొట్టలేక చతికిల పడింది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం బీజేపీలో కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు పర్వేశ్ వర్మ. తను ఎంపీగా రెండుసార్లు గెలుపొందాడు. ప్రస్తుతం న్యూఢిల్లీ స్థానం నుంచి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అరవింద్ కేజ్రీవాల్ పై గ్రాండ్ విక్టరీ నమోదు చేశారు. ప్రస్తుతం తననే సీఎంగా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.