పదాధికారుల సమావేశం
న్యూఢిల్లీ – త్వరలోనే దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో రెండు రోజుల పాటు పదాధికారుల సమావేశం న్యూఢిల్లీలో జరుగుతోంది. తొలి రోజు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి పదాధికారులు హాజరయ్యారు.
బీజేపీ నేషనల్ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్న ఈ సమావేశం కీలకంగా మారింది. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలనే దానిపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది బీజేపీ హైకమాండ్. ముచ్చటగా మూడోసారి పవర్ లోకి వస్తామని, కానీ గతంలో వచ్చిన సీట్ల కంటే మరికొన్ని సీట్లు పెరగాలని ఈ సందర్బంగా స్పష్టం చేసింది.
దేశంలోని 143 కోట్ల మంది మూకుమ్మడిగా సమర్థవంతమైన నరేంద్ర దామోదర దాస్ మోదీ నాయకత్వం కోరుకుంటున్నారని ఇది పార్టీకి శుభ పరిణామమని పేర్కొంది. బీజేపీతో పాటు అనుంగు సంస్థలు కూడా కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
మనందరి లక్ష్యం ఒక్కటే కావాలి..అది ఏకంగా 400 సీట్లకు పైగానే తెచ్చు కోవాలని పేర్కొంది.