NEWSNATIONAL

బీజేపీ ఎమ్మెల్యే పాటిల్ కు షోకాజ్ నోటీస్

Share it with your family & friends

జారీ చేసిన కేంద్ర క్రమ శిక్ష‌ణ క‌మిటీ

క‌ర్ణాట‌క – భార‌తీయ జ‌న‌తా పార్టీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బ‌స‌న్న గౌడ పాటిల్ య‌త్నాల్ కు బిగ్ షాక్ ఇచ్చింది. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు గాను కర్ణాటక ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్‌కు బిజెపి షోకాజ్ నోటీసు జారీ చేసింది.

కేంద్ర క్రమశిక్షణా కమిటీ అనేకసార్లు హెచ్చరికలు చేసినప్పటికీ ప‌ట్టించు కోలేద‌ని జారీ చేసిన నోటీసులో పేర్కొంది పార్టీ. ప్ర‌త్యేకించి పార్టీ ఆదేశాలను పదే పదే ధిక్కరిస్తున్నట్లు పేర్కొంది. దీనిపై ప్రతి స్పందించడానికి లేదా క్రమశిక్షణా చర్య తీసుకోవడానికి ఎమ్మెల్యే బ‌స‌న్న గౌడ పాటిల్ యత్నాల్ కు 10 రోజుల గడువు ఇచ్చిన‌ట్లు స్ప‌ష్టం చేసింది.

రాష్ట్రంలో బీజేపీ ఓడి పోవడానికి మాజీ ముఖ్య‌మంత్రి బీఎస్ యడియూరప్ప తో పాటు ఆయ‌న కుటుంబమే కారణమని యత్నాల్ పదేపదే బహిరంగంగా విమర్శిస్తూ వ‌చ్చారు. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఇదిలా ఉండ‌గా బ‌స‌న్న గౌడ పాటిల్ యత్నాల్‌ను బహిష్కరించాలని బీజేపీ సీనియ‌ర్ నేత‌లు రేణుకాచార్య, బిసి పాటిల్, కట్టా సుబ్రమణ్య నాయుడు, హర్తాళ్ హాలప్ప డిమాండ్ చేస్తుంటే, ఎఫ్‌ఎంఆర్ ఎంపి ప్రతాప్ సింహా ఆయనను బిజెపికి ఆస్తి అని అన్నారు.