బీజేపీని బలోపేతం చేయాలి
జేపీ నడ్డా పార్టీ శ్రేణులకు పిలుపు
ఢిల్లీ – ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశం జరిగింది. బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కిషన్ రెడ్డి, ఏపీ బీజీపీ చీఫ్ పురంధేశ్వరి హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా బీజేపీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే సంస్థాగత పరంగా పార్టీ బలపడిందన్నారు.
ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఏ పార్టీకి లేనంతటి సభ్యత్వ నమోదు బీజేపీకి ఉందని అన్నారు.
ఇదే సమయంలో రాబోయే 2047లో సైతం బీజేపీ తిరిగి దేశ వ్యాప్తంగా పవర్ లోకి రావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రజలు పూర్తిగా సమర్థత, సమగ్రమైన పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. ఆ దిశగానే అత్యధిక రాష్ట్రాలలో కాషాయానికి పట్టం కట్టారని అన్నారు.