Friday, April 4, 2025
HomeNEWSANDHRA PRADESHయూనివ‌ర్శిటీ పేరు మార్పు దారుణం

యూనివ‌ర్శిటీ పేరు మార్పు దారుణం

బీజేపీ నేత విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి కామెంట్

అమ‌రావ‌తి – ఏపీ బీజేపీ సీనియ‌ర్ నేత ఎస్. విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న తెలంగాణ స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పేరు మార్చ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి అద్దం ప‌ట్టిందన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు భాష, సంస్కృతి, ఆత్మ గౌరవం కోసం తన ప్రాణాలను అర్పించిన మహానీయుడని కొనియాడారు. అటువంటి గొప్ప త్యాగమూర్తి పేరు మీద ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చడం తెలుగు భాషను, కోట్ల మంది తెలుగు వారి గౌరవాన్ని అవమానించే చర్యగా అభివ‌ర్ణించారు.

సోమ‌వారం ఎస్. విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు గాంధీ కుటుంబం తప్ప ఏ స్వాతంత్ర‌ సమర యోధులను గౌరవించడం తెలియదన్నారు. కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి, తెలుగు వారి గౌరవంగా నిలిచిన పీవీ నరసింహరావు వరకు స్వంత పార్టీ కాంగ్రెస్ నేతలను సైతం ఎవ్వరినీ గౌరవించిన పాపాన పోలేద‌న్నారు. ఇప్పుడు అదే ద్వేషంతో, తెలుగు భాష కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరును ఆయన జన్మదినానే తొలగించడం దారుణ‌మ‌న్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు నిజమైన ప్రజాస్వామ్యవాది వైతే, హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పేరు మార్చగలరా అని ప్ర‌శ్నించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments