బీజేపీ నేత కొడుకు అరెస్ట్
డ్రగ్స్ తో పట్టుబడిన కొడుకు
హైదరాబాద్ – హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడైతే కొలువు తీరారో ఆనాటి నుంచి నగరంలో దాడులు పెరిగాయి. ఇప్పటికే డ్రగ్స్ వాడితే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. తాజాగా భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు గజ్జల యోగానంద్ కుమారుడు గజ్జల వివేకానంద్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ వార్త సంచలనం కలిగించింది. వివేకానంద్ తో పాటు మరో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ గజ్జల వివేకానంద్ ఎవరో కాదు మంజీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్. అసెంబ్లీలో పోటీ చేసిన యోగానంద్ కుమారుడు. ఆయనకు 37 ఏళ్లు వున్నాయి. సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలిలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో వివేకానంద్, సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీ, నిర్భయ్, కేధార్ తో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేశారు.
స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ -సైబరాబాద్, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా ఆదివారం రాత్రి ఆపరేషన్ నిర్వహించారు. కొకైన్ వాడిన మూడు ప్లాస్టిక్ కవర్లు (వినియోగానికి ముందు ఒక్కో గ్రాము), డ్రగ్స్ వినియోగించేందుకు ఉపయోగించే తెల్లటి రంగు కాగితం, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.