NEWSTELANGANA

రేవంత్ డైలాగ్ లు వ‌ద్దు

Share it with your family & friends

ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వ‌ర్ రెడ్డి
హైద‌రాబాద్ – భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఎన్నిక‌లు రాగానే మాట‌లు చెప్ప‌డం అల‌వాటైంద‌న్నారు. ప్ర‌త్యేకించి సీఎంకు డైలాగులు ఎక్కువై పోయాయ‌ని ఆరోపించారు. ఆయ‌న నంద‌మూరి బాల‌కృష్ణ లాగా, జూనియ‌ర్ ఎన్టీఆర్ లాగా అనుక‌రిస్తూ ఎద్దేవా చేస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ముందు పాల‌న గాడి త‌ప్ప‌కుండా చూసుకుంటే మంచిద‌ని సూచించారు. ఆరోప‌ణ‌లు మానేసి, విమ‌ర్శ‌ల జోలికి వెళ్ల‌కుండా ఉంటే బావుంటుంద‌న్నారు. ప‌దే ప‌దే ప్ర‌జా పాల‌న అంటూ చెబుతున్న రేవంత్ రెడ్డి ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన హామీల‌ను ఎన్ని అమ‌లు చేశారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ఎప్పుడన్న కూర్చొని రివ్యూ చేసి వాస్తవాలు తెలుసుకుంటే మంచిద‌న్నారు. ఏ శాఖ‌లో ఏముందో ఇప్ప‌టి వ‌ర‌కు సీఎంకు తెలియ‌ద‌న్నారు. స‌మీక్ష‌ల పేరుతో కాల‌యాప‌న చేయ‌డం త‌ప్పితే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చేస్తున్న‌ది ఏమీ లేద‌న్నారు ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి. ఇక‌నైనా మాట‌ల‌కు చెక్ పెడితే బావుంటుంద‌ని, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టాల‌ని అన్నారు.