NEWSTELANGANA

జానీ మాస్ట‌ర్ పై రాజా సింగ్ కామెంట్స్

Share it with your family & friends

ఎంత మందిని ఇబ్బంది పెట్టాడో తేల్చండి

హైద‌రాబాద్ – భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. గురువారం ఆయ‌న వీడియో సందేశం ద్వారా టాలీవుడ్ కు చెందిన కొరియో గ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ అలియాస్ షేక్ జానీ బాషా వ్య‌వ‌హారంపై పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు.

ఇంత‌కు ల‌వ్ జిహాద్ సంగ‌తి ఏంటి అంటూ ప్ర‌శ్నించారు రాజా సింగ్. ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాక ఎంత మంది అమ్మాయిల‌ను , యువ‌తుల‌ను వేధించాడో పోలీసులు నిగ్గు తేల్చాల‌ని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే.

ముందు జానీ మాస్ట‌ర్ త‌న వృత్తిని అడ్డం పెట్టుకుని ఎంత మందిని మోసం చేశాడోన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎంత మంది అమ్మాయిల‌ను మ‌త మార్పిడి చేసుకోవాలంటూ ఒత్తిడికి గురి చేశాడో కూడా తేల్చాల‌ని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.

సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ జానీ మాస్ట‌ర్ ను ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు అరెస్ట్ చేయ‌లేక పోయారంటూ నిల‌దీశారు . వెంట‌నే జానీ మాస్ట‌ర్ ను అరెస్ట్ చేయాల‌ని, ఆయ‌న వెనుక ఎవ‌రు ఉన్నారో తేల్చాల‌ని కోరారు బీజేపీ ఎమ్మెల్యే.