బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ వైరల్
ఢిల్లీ – దేశ రాజధానిలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ బాన్సురి స్వరాజ్ సంచలనం సృష్టించారు. తిరంగా జెండా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడారు. ప్రతి ఒక్కరు జాతీయ జెండాను ఎగుర వేయాలని పిలుపునిచ్చారు.
ఇది ఒక్క పతాకమే కాదని 143 కోట్ల మంది భారతీయుల ఆత్మ గౌరవానికి సంబంధించిన పతాకం అని కొనియాడారు. దీనిని గౌరవించాలి. మన జెండా అని నలుగురికి తెలియ చేయాలని పిలుపునిచ్చారు. దీనిని తయారు చేసినందుకు మనం రుణపడి ఉండాలన్నారు.
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు తామంతా నడి వీధుల్లో జాతీయ జెండాలను పట్టుకుని ఎగుర వేస్తున్నామని, మేరా భారత్ మహాన్ అంటూ నినదిస్తున్నామని అన్నారు ఎంపీ బాన్సురి స్వరాజ్.
ఈ దేశపు ప్రగతి, ఆత్మ గౌరవం, గుర్తింపు ఎక్కడో లేదని అది మన త్రివర్ణ పతాకంలో దాగి ఉందన్నారు ఎంపీ. ప్రతి భారతీయుడు తన ఇంటిపై జాతీయ జెండాను పంధ్రాగస్టు రోజు ఎగుర వేయాలని కోరారు బీజేపీ ఎంపీ.