NEWSTELANGANA

బీజేపీ ఎంపీ అభ్య‌ర్థులు వీరే

Share it with your family & friends

ప్ర‌క‌టించిన పార్టీ హై క‌మాండ్

హైద‌రాబాద్ – సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి భార‌తీయ జ‌న‌తా పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌తిప‌క్షాల‌తో కూడిన ఇండియా కూట‌మి కంటే ముందే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. ముంద‌స్తుగా 545 సీట్ల‌కు గాను 195 సీట్ల‌ను ఖ‌రారు చేసింది బీజేపీ హైక‌మాండ్.

ఇక తెలంగాణ వ‌ర‌కు వ‌చ్చేస‌రికి 9 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక్క‌రిని కూడా ఎంపిక చేయ‌లేదు. ఇక అభ్య‌ర్థుల ప‌రంగా చూస్తే భువ‌న‌గ‌రి లోక్ స‌భ స్థానానికి బూర న‌ర్స‌య్య గౌడ్ , సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి, ప్ర‌స్తుత బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు గంగాపురం కిష‌న్ రెడ్డిని ఖ‌రారు చేసింది పార్టీ చీఫ్‌.

హైద‌రాబాద్ లోక్ స‌భ ఎంపీ అభ్య‌ర్థినిగా విరించి హాస్పిట‌ల్ మాధ‌వీల‌త, నాగ‌ర్ క‌ర్నూల్ ఎంపీగా భ‌ర‌త్ ప్ర‌సాద్ , క‌రీంన‌గ‌ర్ ఎంపీగా బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ , జ‌హీరాబాద్ నుంచి బీబీ పాటిల్ , నిజామాబాద్ లోక్ స‌భ ఎంపీగా ధ‌ర్మ‌పురి అర‌వింద్ , చేవెళ్ల లోక్ స‌భ ఎంపీగా కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, మ‌ల్కాజిగిరి ఎంపీగా ఈటెల రాజేంద‌ర్ ను ఖ‌రారు చేసింది బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా.