జార్ఖండ్‌లో అపజయంపై బీజేపీ సమీక్ష
అసలు ఎందుకు ఓడి పోయామని ఆరా
జార్ఖండ్ – దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపాయి తాజాగా మరాఠా, జార్ఖండ్ రాష్ట్రాలలో జరిగిన శాసన సభ ఎన్నికలు. ఎవరూ ఊహించని రీతిలో మరోసారి తమ పీఠాన్ని చేజిక్కించుకుంది ఎన్డీయే సర్కార్ మరాఠాలో. కానీ జార్ఖండ్ లో చతికిల పడటం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది భారతీయ జనతా పార్టీకి.
మహారాష్ట్రలో బీజేపీకి భారీ మెజారిటీ సీట్లు దక్కాయి. ఏకంగా ఆ పార్టీకి 138 సీట్లు వచ్చాయి. ఇదే క్రమంలో జార్ఖండ్ లో చతికిలపడింది. అక్కడ ఎలాగైనా సరే పాగా వేయాలని ప్లాన్ చేసింది. విచిత్రం ఏమిటంటే
మాస్ లీడర్ బాబూలాల్ మరాండీని సీఎం అభ్యర్థిగా ప్రకటించక పోవడం ఆ పార్టీకి జార్ఖండ్ లో నష్టం కలిగించిందని రాజకీయ వర్గాల విశ్లేషణ.
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నుండి బయటకు వచ్చిన ఇద్దరు నాయకులు రాష్ట్ర యూనిట్ కు నాయకత్వం వహిస్తున్నట్లు ప్రకటించింది. మైయా సమ్మాన్ జేఎంఎం కోసం మాస్టర్ స్ట్రోక్ అయ్యాడు. కానీ ఎన్నికల్లో ప్రభావితం చూపలేక పోయాడు. జేఎల్ కేఎం 14 సీట్లలో బీజేపీని బాగా దెబ్బ తీసిందని చెప్పక తప్పదు.
బీజేపీ, దాని కూటమి గ్రామీణ ప్రజలతో కనెక్ట్ చేయలేక పోయారు. ఇది ఎన్నికలలో ఓట్లను రాబట్ట లేక పోయిందని చెప్పక తప్పదు. మొత్తంగా మరోసారి జార్ఖండ్ లో జెండా ఎగుర వేయాలన్నది మోడీ, షా లక్ష్యం. మరి ఏ మేరకు సాధిస్తారనేది చూడాలి.