మరాఠాలో ఎన్డీయే కూటమిదే హవా
సీఎం ఎవరో త్వరలోనే తేలుతుంది
మహారాష్ట్ర – మహారాష్ట్రలో ఇండియా కూటమికి బిగ్ షాక్ తగిలింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వల్లనే ఎన్డీయే కూటమి గెలుపొందిందని సంచలన ఆరోపణలు చేశారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. మరో వైపు జార్ఖండ్ లో హేమంతే సోరేన్ సారథ్యంలోని జేఎంఎం ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. చివరకు ఎన్డీయే మరాఠాలో మరోసారి పాగా వేస్తే జార్ఖండ్ లో చతికిల పడింది. ఒక రకంగా చెరో రాష్ట్రం పంచుకున్నాయని చెప్పక తప్పదు.
మరాఠాలో స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకు పోతోంది ఎన్డీయే. ఇక్కడ అత్యధిక స్థానాలలో భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. ఆ పార్టీ 148 స్థానాలలో బరిలోకి దిగింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 52 స్థానాలలో నిలవగా , ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ 80 స్థానాలలో పోటీ చేసింది.
ఇక మహా వికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ పార్టీ 102 స్థానాలలో పోటీ చేయగా శివసేన ఉద్దవ్ ఠాక్రే పార్టీ 96 స్థానాలలో, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ 86 సీట్లలో పోటీ చేశాయి. సమాజ్ వాదీ పార్టీ 2 స్థానాలలో నిలబడింది.