NEWSANDHRA PRADESH

టీడీపీ..జ‌న‌సేన‌..బీజేపీ పొత్తు ఖ‌రారు

Share it with your family & friends

అమిత్ షాతో చ‌ర్చ‌లు స‌ఫ‌లం

న్యూఢిల్లీ – ఏపీలో పొత్తుల‌పై ఉత్కంఠ‌కు తెర ప‌డింది. నారా చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలోని టీడీపీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీతో జేపీ న‌డ్డా ఆధ్వ‌ర్యంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎట్ట‌కేల‌కు పొత్తు కుదిరింది. పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ గా గుర్తింపు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా తో శ‌నివారం భేటీ అయ్యారు. ప్ర‌ధానంగా సీట్లపై పొత్తుకు సంబంధించి ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం.

చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్, పురందేశ్వ‌రి లు అమిత్ షాతో భేటీ అయ్యారు. వీరితో పాటు బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజు సైతం పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా ఏపీలో అసెంబ్లీ ప‌రంగా 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా పార్ల‌మెంట్ కు సంబంధించి 25 ఎంపీ సీట్లు ఉన్నాయి.

సీట్ల పంపకానికి సంబంధించి ఆయా పార్టీలు ఓ అంచ‌నాకు వ‌చ్చిన‌ట్లు టాక్. ఇందులో భాగంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ, జ‌న‌సేన కూట‌మికి 8 లోక్ స‌భ స్థానాల‌తో పాటు 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు ఒప్పుకున్న‌ట్లు టాక్.