మరాఠా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ టాప్
132 సీట్లను గెలుచుకుని నెంబర్ వన్
మహారాష్ట్ర – ఎంతో ఉత్కంఠ రేపిన ఎన్నికల ఫలితాలు ముగిశాయి. ఎవరూ ఊహించని రీతిలో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది శాసన సభ ఎన్నికల్లో. మహాయుతి ఎన్డీయే కూటమిలో కీలకమైన భూమిక పోషించింది . ఈ ఫలితాలు మరింత బాధ్యతను పెంచేలా చేశాయని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ట్రబుల్ షూటర్ , కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా.
ఇదిలా ఉండగా ముగిసిన ఎన్నికలకు సంబంధించి పూర్తి ఫలితాలను అధికారికంగా ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. తుది లెక్కల ప్రకారం మహారాష్ట్రలో మొత్తం 288 సీట్లు. ఇందులో అత్యధికంగా భారతీయ జనతా పార్టీ 132 సీట్లు కైవసం చేసుకుంది. శివసేన (షిండే) పార్టీకి 57 సీట్లు రాగా, ఎన్సీపీ (అజిత్ పవార్ ) 41 సీట్లలో సత్తా చాటింది. ఇది ఊహించని ఫలితాలు కావడం విశేషం.
ఇక మహా వికాస్ అఘాడీ కూటమికి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలలో పోటీ చేసింది. కానీ కేవలం 16 సీట్లకే పరిమితమైంది. శివసేన ఉద్దవ్ ఠాక్రే పార్టీ 20 సీట్లను సరిపెట్టుకుంది. ఎన్సీపీ (శరద్ పవార్ ) పార్టీకి కేవలం 10 సీట్లతో సరి పెట్టుకుంది. విచిత్రం ఏమిటంటే రాజకీయాలలో మేరునగ ధీరుడిగా పేరు పొందిన శరద్ పవార్ ఓడి పోయారు.