సర్కార్ ను దించేసిన ఉల్లి ధరలు
ఢిల్లీ – ఢిల్లీ వాసులు బీజేపీకి పట్టం కట్టారు. 70 సీట్లకు గాను 47 సీట్లలో భారీ విజయాన్ని కట్టబెట్టారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఆనాటి ప్రభుత్వం కేవలం ఉల్లిగడ్డల ధరలు పెరగడం, దానిని కంట్రోల్ చేయక పోవడంతో సాహెబ్ సింగ్ వర్మకు చేదు అనుభవం ఎదురైంది. ధరలను నియంత్రించలేని సర్కార్ ను జనం దించేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ , ఆప్ అధికారంలోకి వచ్చాయి. పదేళ్లు పాలించిన ఆప్ కు బీజేపీ షాక్ ఇచ్చింది.
ఇదిలా ఉండగా ఈసారి వరుసగా మూడోసారి గెలిచి తీరుతామని పూర్తి నమ్మకంతో పని చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. కేవలం 23 సీట్లకే పరిమితం చేశారు. ఇక సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును కూడా చేజిక్కించు కోలేక చతికిల పడింది.
ప్రధానంగా అవినీతి రహిత పాలన సాగిస్తామని చెబుతూ వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ చివరకు అవినీతి, అక్రమాలకు ఆప్ ను కేరాఫ్ గా చేశారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. తను కూడా అరెస్ట్ అయ్యారు ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. మోడీని ఎదుర్కోవడంలో తను ఫెయిల్ అయ్యారు.