రూ. 19 కోట్ల బకాయిలు చెల్లించాలని
హైదరాబాద్ – అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరిస్తూ వచ్చిన భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి కేటీఆర్ కు అనుంగు అనుచరుడిగా పేరు పొందాడు. అంతే కాదు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. భూ దందాలు , సెటిల్మెంట్లకు ట్రై చేసినట్లు విమర్శలున్నాయి.
తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మాజీ ఎమ్మెల్యే షకీల్ కు నోటీసులు జారీ చేసింది. తీసుకున్న రూ. 19 కోట్ల అప్పులు చెల్లించాలంటూ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు నోటీసులకు స్పందించక పోవడంతో ఆస్తులు జప్తు చేయాల్సి వస్తుందని పేర్కొంది.
గడువు లోగా చెల్లించాలని లేక పోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. షకీల్ కానీ , ఆయన అనుచరులు కానీ, కుటుంబీకులు కానీ స్పిందించక పోవడం గమనార్హం. కాగా షకీల్ కుమారుడు రాహిల్ ప్రజా భవన్ వద్ద మద్యం మత్తులో డివైడర్ ను ఢీకొట్టాడు. చెప్పకుండా దుబాయ్ కి పారి పోయాడు. పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేయడంతో గత్యంతరం లేక దిగి వచ్చాడు.