రిషబ్ శెట్టి కామెంట్స్ బాలీవుడ్ సీరియస్
దేశాన్ని తప్పుగా చూపిస్తున్నారంటూ ఫైర్
ముంబై – ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు..జాతీయ చలన చిత్ర అవార్డు గ్రహీత కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. భారత దేశాన్ని సరిగా చూపించడంలో బాలీవుడ్ పూర్తిగా విఫలమైందని పేర్కొనడం పట్ల మండి పడుతున్నారు దర్శక, నిర్మాతలు, నటీ నటులు, ఇతర సాంకేతిక నిపుణులు.
తాను తీసి, నటించిన కాంతారా సినిమాకు జాతీయ పురస్కారం లభించడంపై స్పందించారు రిషబ్ శెట్టి. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ బాలీవుడ్ పై నిప్పులు చెరిగారు. వారికి అంత సీన్ లేదని పేర్కొన్నాడు. ఇతర భాషా సినిమాలు, నటీ నటులు, టెక్నిషియన్స్ అంటే చులకన భావం ఉంటుందన్నారు.
కానీ సౌత్ ఇండియా ఇప్పుడు దేశ సినిమా రంగాన్ని ఏలుతోందని పేర్కొన్నాడు రిషబ్ శెట్టి. అంతే కాకుండా నేను నా దేశం, నా రాష్ట్రం, నా భాష నా గర్వం. దానిని సానుకూలంగా ఎందుకు చూపించకూడదని ప్రశ్నించాడు. అంతే కాదు దానిని చూపించేందుకే తాను ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు.
అయితే రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలపై బాలీవుడు నటీ నటులు భగ్గుమన్నారు. అవార్డు వచ్చినంత మాత్రాన ఇలాగేనా మాట్లాడేది అంటూ ఫైర్ అయ్యారు.