బుల్లెట్ గాయం గోవింద సురక్షితం
ఆస్పత్రికి తరలించిన కుటుంబం
ముంబై – ప్రముఖ బాలీవుడ్ నటుడు, శివసేన పార్టీ సీనియర్ నేత గోవిందకు బుల్లెట్ గాయం అయ్యింది. ఆయనను హుటా హుటిన క్రిటికేర్ ఆస్పత్రికి తరలించారు. ఆయన వస్సు 60 ఏళ్లు. మంళవారం ముంబై లోని తన ఇంట్లో ప్రమాదవశాత్తు బుల్లెట్ కారణంగా గాయపడ్డారు. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు.
ఈ ఘటన ఇవాళ తెల్లవారుజామున 4.45 గంటలకు చోటు చేసుకుంది. నటుడు గోవింద కోల్‌కతా పర్యటనకు సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్చారు.
ప్రమాదానికి సంబంధించి గోవింద మేనేజర్ శశి సిన్హా మాట్లాడారు. కోల్ కతాకు బయలుదేరే సమయంలో చేతిలో నుంచి రివాల్వర్ పడి పోయిందని, ప్రమాదవశాత్తు బుల్లెట్ పేలిందన్నారు. పిస్టల్ లైసెన్స్ కలిగి ఉందని తెలిపారు. దీంతో పడి పోయిన బుల్లెట్ కాలికి దూసుకు పోయిందన్నారు. డాక్టర్లు బుల్లెట్ ను తొలగించారని, ప్రస్తుతం ప్రమాదం నుంచి బయట పడ్డాడని తెలిపారు శశి సిన్హా.
ఇదిలా ఉండగా గోవింద 1980 చివరలో సినిమాలలోకి ప్రవేశించాడు. బాలీవుడ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరు. యాక్షన్, డ్రామా చిత్రాలలో తన వృత్తిని స్టార్ట్ చేశాడు. 1990లో కామెడీలో తనదైన ముద్ర వేశారు. మొత్తం 165 చిత్రాలలో ఇప్పటి వరకు నటించాడు.