ENTERTAINMENT

హిందువుల‌పై దాడులు దారుణం

Share it with your family & friends

ప్ర‌ముఖ న‌టి ప్రీతి జింటా కామెంట్స్

ముంబై – ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి ప్రీతి జింటా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె తొలిసారిగా బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై స్పందించారు. ఆదివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా అక్క‌డ ప్ర‌ధానంగా హిందువుల‌పై ప‌నిగ‌ట్టుకుని దాడుల‌కు పాల్ప‌డ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. దీనిని ప్ర‌తి ఒక్క‌రు ఖండించాల‌ని కోరారు.

ఈ ప్ర‌పంచంలో ఎవ‌రైనా ఎక్క‌డైనా ప్ర‌తి ఒక్క‌రికీ బ‌తికే హ‌క్కు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. నిన్న‌టి దాకా సోద‌ర సోద‌రీమ‌ణులుగా భావిస్తూ వ‌చ్చిన హిందువుల ప‌ట్ల దారుణంగా దాడుల‌కు దిగ‌డం, దూషించ‌డం, వారికి చెందిన ఇళ్ల‌ను, దేవాల‌యాల‌ను ధ్వంసం చేయ‌డం, షాపుల‌ను లూటీ చేయ‌డం ప‌ట్ల ప్రీతి జింతా తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

బాలీవుడ్ నుంచి కేవ‌లం ప్రీతి జింటా మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు హిందువుల త‌ర‌పున నోరు విప్పారు. ఇదిలా ఉండ‌గా ఆమెను కొంద‌రు రాడిక‌ల్స్ టార్గెట్ చేస్తూ కించ ప‌రిచేలా కామెంట్స్ పెట్టారు. అయినా ప్రీతి జింటా వెన‌క్కి త‌గ్గ‌లేదు. హిందువుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన బాధ్య‌త ప్ర‌స్తుత తాత్కాలిక ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు. లేక పోతే భార‌త ప్ర‌భుత్వం జోక్యం చేసుకోవాల‌న ప్రీతి జింటా కోరారు.