బడులకు బాంబు బెదిరింపు
రంగంలోకి దిగిన పోలీసులు
న్యూఢిల్లీ – దేశ రాజధాని న్యూ ఢిల్లీలో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆయా పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు అప్రమత్తం అయ్యాయి. ఈ మేరకు ఆయా బడుల్లో చదువుకుంటున్న విద్యార్థులను ఖాళీ చేయించారు. ఆ వెంటనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సమాచారం అందించారు.
ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 100 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్టు గుర్తించారు పోలీసులు. ఈ మేరకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ ద్వారా వచ్చినట్లు నిర్దారించారు. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. సహాయక చర్యలు చేపట్టారు.
ఆయా పాఠశాలలకు చెందిన వాహనాలలో స్టూడెంట్స్ ను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బాంబు బెదిరింపులు ఢిల్లీతో పాటు నోయిడాలోని స్కూళ్లకు వచ్చినట్లు సమాచారం. పాఠాశాల ఆవరణను ఖాళీ చేయించాచరు. విద్యార్థులను ఇళ్లకు పంపించారు.
ఇదిలా ఉండగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. బుధవారం శాఖ తరపున ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.