నిర్మాత బోనీ కపూర్ కామెంట్
హైదరాబాద్ – ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కీలక వ్యాఖ్యలు చేశారు నటుడు అల్లు అర్జున్ కు సంబంధించి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై స్పందించారు. ఈ ఘటనలో రేవతి చని పోవడం, ఆమె తనయుడు శ్రీతేజ్ చావు బతుకుల మధ్య ఉండడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో అల్లు అర్జున్ కు ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. తను అమాయకుడని, కావాలని ఇరికించారంటూ ఆరోపించారు.
జనాలు ఎక్కువగా రావడంతోనే తొక్కిసలాట జరిగిందన్నారు. ఇది కావాలని చేసింది కాదన్నారు నిర్మాత బోనీ కపూర్. చిరంజీవి, అజిత్, రజినీకాంత్, అల్లు అర్జున్ లాంటి హీరోల సినిమా లకు మొదటి రోజు వేలాది మంది అభిమానులు వస్తారని ఇది సహజమన్నారు.
అలాంటప్పుడు ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ ఘటన కావాలని జరిగింది కాదని మరోసారి స్పష్టం చేశారు బోనీ కపూర్. అల్లు అర్జున్ కు సంధ్య థియేటర్ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని , పోలీసులు అనవసరంగా కేసు నమోదు చేశారని పేర్కొన్నారు . ఇది మంచి పద్దతి కాదన్నారు. అనుకోకుండా జరిగిన సంఘటనకు బన్నీనే బాధ్యుడిని చేస్తే ఎలా అని ప్రశ్నించారు.