సీఎంను కలిసిన బొంతు..ఎమ్మెల్యే
రేవంత్ తో భేటీ అయిన మాజీ ఎమ్మెల్సీ
హైదరాబాద్ – మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ , మాజీ ఎమ్మెల్సీ డి. రాజేశ్వర్ రావు మర్యాద పూర్వకంగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్య నారాయణ ఉన్నారు. ఈ సందర్బంగా పలు సూచనలు, సలహాలు అందజేశారు .
రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన ప్రజా ప్రభుత్వానికి విలువైన సలహాలు ఇవ్వాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేకించి హైదరాబాద్ నగర అభివృద్దికి సంబంధించి పలు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అంతే కాకుండా మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని ప్రత్యేకంగా డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సీఎం.
గతంలో మేయర్ గా పని చేసిన అనుభవం కలిగిన బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరడం మరింత బలాన్ని చేకూర్చినట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో పలు ఐటీ, లాజిస్టిక్, ఫార్మా కంపెనీలు పెద్ద ఎత్తున మన రాజధానిని ఎంపిక చేసుకుంటున్నాయని, తమ సర్కార్ ఔత్సాహికులకు, వ్యాపారవేత్తలకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు.