NEWSTELANGANA

కాంగ్రెస్ లో చేరిన మాజీ మేయ‌ర్

Share it with your family & friends

సీఎంను క‌లిసిన బొంతు రామ్మోహ‌న్

హైద‌రాబాద్ – రాష్ట్రంలో కాంగ్రెస్ స‌ర్కార్ రావ‌డంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి వ‌ల‌స‌లు పెరిగాయి. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌జా ప్ర‌తినిధులు జంప్ అయ్యారు. తాజాగా తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ‌కు మేయ‌ర్ గా ఉన్న బొంతు రాంమోహ‌న్ ఉన్న‌ట్టుండి రూట్ మార్చారు. మాజీ సీఎం కేసీఆర్ కు, కేటీఆర్ కు కోలుకోలేని షాక్ ఇస్తూ కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు.

బొంతు రామ్మోహ‌న్ ముందు నుంచి కేటీఆర్ కు అనుంగు అనుచ‌రుడిగా పేరు పొందారు. మాజీ మేయ‌ర్ తో పాటు చ‌ర్ల‌ప‌ల్లి కార్పొరేట‌ర్ బొంతు శ్రీ‌దేవి యాద‌వ్ కూడా కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. గాంధీ భ‌వ‌న్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపా దాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి దీపాదాస్ మున్షీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్, మైనంపల్లి హన్మంతరావు, సంపత్ కుమార్ ,చక్రధర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి సింగిరెడ్డి, హరివర్ధన్ రెడ్డి, నర్సారెడ్డి భూపతి రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, నవీన్ యాదవ్, వజ్రేశ్ యాదవ్ పాల్గొన్నారు.